శనివారం 11 జూలై 2020
Telangana - May 28, 2020 , 19:21:17

వచ్చే నెల 1 నుంచి 8 వరకు ‘పట్టణ ప్రగతి’

వచ్చే నెల 1 నుంచి 8 వరకు ‘పట్టణ ప్రగతి’

హైదరాబాద్‌: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జూన్‌ 1 నుంచి 8వ తేదీ వరకు ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం నిర్వహించాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. పట్టణప్రగతి కార్యక్రమంపై అదనపు కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, పట్టణప్రణాళిక, మెప్మా అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వర్షాకాలాన్ని దృష్టిలోపెట్టుకుని పట్టణాల్లో పనులు చేపట్టాలని సూచించారు. సీజనల్‌ వ్యాధులు, దోమల వ్యాప్తిని సమర్థంగా ఎదుర్కోవాలని ఆదేశించారు. హరితహారం కార్యక్రమాన్నికూడా దృష్టిలో పెట్టుకోవాలన్నారు. హైదరాబాద్‌ శివారు మున్సిపాలిటీలకు కావల్సినన్ని మొక్కలు అందించాలని చెప్పారు. మున్సిపాలిటిలో నూటికి నూరుశాతం పన్నులు వసూలు చేయాలన్నారు. 


logo