శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 19:26:39

40 ట్రాక్ట‌ర్ల‌ను ఉచితంగా అందించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

40 ట్రాక్ట‌ర్ల‌ను ఉచితంగా అందించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

సంగారెడ్డి : ప‌టాన్ చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మ‌హిపాల్ రెడ్డి.. 40 గ్రామ‌పంచాయ‌తీల‌కు ఉచితంగా ట్రాక్ట‌ర్ల‌ను పంపిణీ చేశారు. మైత్రి మైదానంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు హాజ‌ర‌య్యారు. ఎమ్మెల్యే ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న జీఎంటీ ట్ర‌స్టు ద్వారా రూ. 4.4 కోట్లు ఖ‌ర్చు పెట్టి ట్రాక్ట‌ర్ల‌ను కొనుగోలు చేశారు. ఒక్కో ట్రాక్ట‌ర్ ఖ‌రీదు రూ. 11 ల‌క్ష‌లు. 

మైత్రి మైదానంలో ఏడు పంచాయ‌తీల‌కు ట్రాక్ట‌ర్ల‌ను హ‌రీష్ రావు చేతుల మీదుగా అంద‌జేశారు. ఉచితంగా ట్రాక్ట‌ర్ల‌ను అంద‌జేసిన మ‌హిపాల్ రెడ్డిని హ‌రీష్ రావు ప్ర‌శంసించారు. పంచాయతీల‌కు ఈ ట్రాక్ట‌ర్లు చాలా ర‌కాలుగా ఉప‌యోగ‌ప‌డుతాయ‌ని మంత్రి పేర్కొన్నారు. ఈ 40 గ్రామ‌పంచాయ‌తీల ప్ర‌జ‌లు ఎమ్మెల్యేను ఎల్ల‌ప్పుడూ గుర్తుంచుకుంటార‌ని చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ నియోజ‌క‌వ‌ర్గంలో కూడా ఎమ్మెల్యేలు త‌మ‌ సొంత నిధుల‌తో ట్రాక్ట‌ర్ల‌ను కొనుగోలు చేయ‌లేద‌ని హ‌రీష్ రావు స్ప‌ష్టం చేశారు. 


logo