శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 23, 2020 , 21:40:35

ప్రయాణికులను తరలిస్తున్న అంబులెన్సులు సీజ్‌

ప్రయాణికులను తరలిస్తున్న అంబులెన్సులు సీజ్‌

కోదాడ  : ప్రయాణికులతో వెళ్తున్న మూడు అంబులెన్సులను రాష్ట్ర సరిహద్దు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం 65వ జాతీయ రహదారిపై పోలీసులు పట్టుకున్నారు. ఎంవీఐ సుభాష్‌ తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో అత్యవసర సేవలు అందించేందుకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన మూడు అంబులెన్సులు మార్గమధ్యలో ఆంధ్రాకు వెళ్లే ప్రయాణికులను ఎక్కించుకున్నారు. సరిహద్దు తనిఖీలో పట్టుబడటంతో అధికారులు ప్రయాణికులను దించి మూడు వాహనాలను ఎంవీఐ సరిహద్దు తనిఖీ కేంద్రానికి తరలించారు. 


logo