ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 04, 2020 , 01:59:59

ఇంటర్‌ పరీక్ష రాయనోళ్లూ పాస్‌

ఇంటర్‌ పరీక్ష రాయనోళ్లూ పాస్‌

  • గ్రేస్‌ మార్కులతో 27,589 మంది ఉత్తీర్ణత
  • ఉన్నత విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఇంటర్మీడియట్‌ పరీక్షలకు గైర్హాజరు కారణంగా ఫెయిలైన విద్యార్థులందరినీ గ్రేస్‌ మార్కులతో పాస్‌ చేస్తున్నట్టు ఉన్నత విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు మంగళవారం ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ జీవో 205 విడుదల చేశారు.  ఈ ఒక్కసారికే ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో పరీక్షలకు హాజరుకాని 27,251 మంది, మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన మరో 338 మంది కలిపి మొత్తం 27,589 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనున్నది. సవరించిన మార్కుల జాబితాలను ఈ నెల 5వ తేదీ నుంచి www.tsbie. cgg.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఒక ప్రకటనలో తెలిపారు.