సోమవారం 01 మార్చి 2021
Telangana - Jan 21, 2021 , 08:32:31

ఫస్టియర్‌ ఫెయిలైన వారికి పాస్‌ మార్కులు!

ఫస్టియర్‌ ఫెయిలైన వారికి పాస్‌ మార్కులు!

హైద‌రాబాద్ : ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫెయిల్‌ అయిన విద్యార్థులందరికీ పాస్‌మార్కులు వేసి ఉత్తీర్ణులుగా ప్రకటించాలని ఇంటర్‌బోర్డు అధికారులు యోచిస్తున్నారు. 2020లో నిర్వహించిన పరీక్షల్లో 1.92 లక్షల మంది ఫస్టియర్‌ విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు. వీరికి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, కరోనా నేపథ్యంలో వీలుపడలేదు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు కనీస మార్కులు వేసి ఉత్తీర్ణులుగా ప్రకటించారు. ఇదే తరహాలో ఫస్టియర్‌ వారిని సైతం ఉత్తీర్ణులుగా ప్రకటించాలన్న డిమాండు ఉన్నది. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి, ఆమోదం రాగానే నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. 

యథావిధిగా ప్రాక్టికల్‌ పరీక్షలు

ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాక్టికల్‌ పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లో మినహాయించేది లేదని అధికారులు తెలిపారు. ఇంటర్నల్‌ పరీక్షలైన ఎథిక్స్‌ అండ్‌ హ్యుమన్‌ వ్యాల్యూస్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ పరీక్షలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. 


VIDEOS

logo