బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 14:46:41

ఓపెన్‌ స్కూల్‌ పది, ఇంటర్‌ విద్యార్థులకు పాస్‌ మార్కులు

ఓపెన్‌ స్కూల్‌ పది, ఇంటర్‌ విద్యార్థులకు పాస్‌ మార్కులు

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని ఓపెన్‌ స్కూల్స్‌ విద్యార్థులకు శుభవార్త. ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే పాస్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులందరికీ 35 మార్కులు ఇవ్వాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంతో పదో తరగతిలో 35 వేలు, ఇంటర్‌లో 43 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది. 

కరోనా వ్యాప్తి దృష్ట్యా ఓపెన్‌ స్కూల్‌ పది, ఇంటర్‌ పరీక్షలను రద్దు చేయాలని ఓసెన్‌ స్కూల్స్‌ సొసైటీ డైరెక్టర్‌ ఎస్‌ వెంకటేశ్వర శర్మ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన విషయం విదితమే. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి.. విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌ అందించింది.


logo