గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 11, 2020 , 20:52:05

రూర్బన్‌ ప్రాజెక్టుతో ప‌ర్వతగిరి సమగ్ర ప్రగతి : మంత్రి ఎర్రబెల్లి

రూర్బన్‌ ప్రాజెక్టుతో ప‌ర్వతగిరి సమగ్ర ప్రగతి : మంత్రి ఎర్రబెల్లి

వ‌రంగ‌ల్ రూర‌ల్ : రూర్బన్‌ ప్రాజెక్టుతో పర్వతగిరి సమగ్రాభివృద్ధి సాధ్యమని ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తి ప్రణాళిక‌లు రూపొందించామ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు. తొలి విడుత‌ వ‌చ్చిన రూ.30 కోట్లతో ప్రజల అవ‌స‌రాల‌క‌నుగుణంగా అభివృద్ధి పనులు చేప‌డ‌తామ‌ని పేర్కొన్నారు. రూర్బన్‌ ప్రాజెక్టు నిధులతో పనులు చేపట్టాలని నిర్ణయించిన ప్రాంతాలను వ‌ర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్, ఆయా శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి మంత్రి శనివారం ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా  ఆయన పర్వతగిరి ఊర‌ చెరువు వ‌ద్ద మొక్కలు నాటి చెరువు క‌ట్టను ప‌రిశీలించారు. చెరువును విస్తరించాలని వ‌చ్చే ఏడాది నుంచి ద‌స‌రా ఉత్సవాలు ఇక్కడే జ‌రిగేలా చర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అనంతరం అన్నారం ద‌ర్గా చెరువును ప‌రిశీలించారు. చెరువుతోపాటు ప‌రిశుభ్రంగా ఉండేలా చూడాల‌ని ఆదేశించారు. అన్నారం గ్రామం ద‌ర్గా దర్శనార్థం చాలా మంది భ‌క్తులు వ‌స్తుంటారు. ఇక్కడ సకల వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. అన్నారం ష‌రీఫ్ దర్గాతోపాటు పర్వత‌గిరిని ప‌ర్యాట‌క ప్రాంతంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటాన‌ని అన్నారు. మంత్రి వెంట వివిధ శాఖ‌ల అధికారులు ఉన్నారు.


logo