బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 13, 2020 , 02:30:50

హరితహారంలో భాగస్వాములవ్వాలి

హరితహారంలో భాగస్వాములవ్వాలి

  • రవాణాశాఖ మంత్రి పువ్వాడ

ఖమ్మం: ప్రభుత్వంప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములవ్వాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కోరారు. ఆదివారం ఖమ్మం పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ఇక్బాల్‌, కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌తో కలిసి మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, అధికారులు హరితహారంలో ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, మేయర్‌ డాక్టర్‌ జీ పాపాలాల్‌ తదితరులు పాల్గొన్నారు. logo