ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 26, 2020 , 18:26:35

హరితహారంలో భాగస్వాములవ్వాలి : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హరితహారంలో భాగస్వాములవ్వాలి : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ : సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములై, మొక్కలు నాటాలని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం మాదారం గ్రామంలోని రాకంకొండ శ్రీ వేంకటేశ్వర ఆలయం వద్ద 6వ విడుత హరితహారంలో భాగంగా శుక్రవారం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు మొక్కల నాటింపు కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడుతున్నారన్నారు. ఆయన ఆశయాన్ని సాధించే దిశగా ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని కోరారు. జిల్లాలో అటవీ శాతం తక్కువగా ఉన్నదని ప్రజలు విధిగా  5 మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో ఇప్పటికే 5 విడుతల్లో నాటిన మొక్కలు పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయని, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కల పెంపకం అత్యవసరమన్నారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులున్నారు. 


logo