గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 03, 2020 , 22:00:25

ఈ నెల 7 నుంచి హైకోర్టులో పాక్షిక సేవలు

ఈ నెల 7 నుంచి హైకోర్టులో పాక్షిక సేవలు

హైదరాబాద్‌ : కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గేలా లేకపోవడంతో సేవల పునరుద్ధరణకు హైకోర్టు నిర్ణయించింది. ఆరు నెలల తర్వాత తిరిగి హైకోర్టు భవనంలో కేసుల విచారణ కొనసాగించడానికి ప్రయత్నాలు చేపట్టింది. ఈ నెల 7వ తేదీ నుంచి పాక్షికంగా సేవలు ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయించింది. ఐదు బెంచ్‌లు పని చేసేలా ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ద్విసభ్య ధర్మాసనం, నాలుగు సింగిల్‌ బెంచ్‌లు పని చేయనున్నాయి. మిగతా బెంచ్‌లు ఈ నెల 21 వరకు ఆన్‌లైన్‌లోనే విచారణలోనే కేసులు విచారణ జరుపుతాయని హైకోర్టు పేర్కొంది. అలాగే ప్రయోగాత్మకంగా కరీంనగర్‌ జిల్లాలో కోర్టులు తెరవాలని హైకోర్టు నిర్ణయించింది. ఈ 7 నుంచి 11వ తేదీ వరకు ప్రయోగాత్మకంగా కరీంనగర్‌ జిల్లాలో కోర్టులు పని చేయనున్నాయి. 21వ తేదీ తర్వాత మిగతా జిల్లాల కోర్టుల్లో కేసుల విచారణ చేపట్టనున్నట్లు పేర్కొంది. అప్పటి వరకు ఆన్‌లైన్‌లోనే కేసులు విచారించనున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo