ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 18, 2020 , 02:46:47

పార్ట్‌ నంబర్‌ అవసరం లేదు

పార్ట్‌ నంబర్‌ అవసరం లేదు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్‌ పత్రాల్లో ఓటరు లిస్టులోని పార్ట్‌ నంబరును తెలుపాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఈ మేర కు మంగళవారం ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. పార్ట్‌నంబరు తెలుపలేదన్న కారణంతో నామినేషన్‌లను తిరస్కరించవద్దని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, డిప్యూటీ కమిషనర్‌లు ఈ విషయాన్ని రిటర్నింగ్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు.

నామినేషన్‌ పేపర్‌లో 11 అంశాలు తప్పనిసరి 

1. డివిజన్‌ పేరు. 2. అభ్యర్థిపేరు. 3. తండ్రి/భర్త పేరు 4. వయస్సు. 5. చిరునామా. 6. ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులైతే ఆ వివరాలు నమోదు చేయాలి. 7. ఓటర్ల జాబితాలో ఉన్న అభ్యర్థి పేరుతోసహా డివిజన్‌ నంబరు/పేరు పేర్కొనాలి (ఇది తప్పనిసరి). 8. అభ్యర్థి డివిజన్‌ నంబరు, పార్ట్‌నంబరు (పార్ట్‌ నెంబరును సూచించాల్సిన అవసరం లేదు).  9. ప్రతిపాదించే వారి పేరు. 10. ప్రతిపాదించేవారి డివిజన్‌ నంబరు. 11. ప్రతిపాదించే వారి సంతకం ఉండాలి.