బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 01, 2020 , 00:50:50

నా బిడ్డకు ప్రాణంపోయరూ!

నా బిడ్డకు ప్రాణంపోయరూ!

-రక్తహీనతతో హమాలీ బిడ్డ అవస్థ  

-వైద్యానికి డబ్బులు లేక మనోవేదన

-సాయంకోసం తల్లిదండ్రుల వేడుకోలు

సిర్పూర్‌(టి): అసలే నిరుపేద కుటుంబం.. ఆపై బిడ్డకు రక్తహీనత.. వైద్యానికి డబ్బులులేక అల్లాడుతు న్న తల్లిదండ్రులు.. ఎవరైన దాతలు సాయం చేసి తమ కొడుకు ప్రాణం కాపాడాలని వేడుకొంటున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌(టి)లోని పేట్‌ మహేళాకాలనీకి చెందిన షేక్‌అహ్మద్‌-బద్రున్సీసా బేగం దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతు ర్లు. రెండోకుమాAsiరుడు రహేమత్‌(23) చిన్నతనం నుంచి రక్తహీనతతో బాధపడుతున్నాడు. షేక్‌అహ్మద్‌ హమాలీగా పనిచేస్తూ కుటుంబాన్ని సాకుతున్నాడు. చెట్టంత కొడుకు మంచం పట్టడంతో తోచిన కాడికి చికి త్స చేయిస్తూ కాలం వెళ్లదీశారు. నెలరోజులుగా సమ స్య తీవ్రమైంది. ప్రస్తుతం మూడుశాతం రక్తం మాత్ర మే ఉన్నదని, వీలైనంత త్వరగా రక్తం ఎక్కించాలని వైద్యులు చెప్పడంతో ఏం చేయాలో తెలియక ఆ పేద తండ్రి కంటతడి పెడుతున్నాడు. తన కుమారుడి వైద్యానికి దాతలు సాయం చేయాలని వేడుకుంటున్నాడు. ఆర్థిక సాయమందించాల్సిన వారు ఎస్బీఐ, సిర్పూర్‌(టి) బ్రాంచ్‌, అకౌంట్‌నంబరు: 62280167648, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌: ఎస్‌బీఐఎన్‌ 0020132లో జమ చేయవచ్చు. వివరాల కోసం 77804 33005నంబర్‌లో సంప్రదించవచ్చని కోరారు.


logo