గురువారం 16 జూలై 2020
Telangana - Jun 10, 2020 , 15:31:01

ఈ- ఆఫీసు విధానంతో కాగిత రహిత పాలన

ఈ- ఆఫీసు విధానంతో కాగిత రహిత పాలన

మహబూబ్ నగర్ : పారదర్శకత, గోప్యత, పేపర్ వాడకం లేకుండా ఫైలు నిర్వహించేందుకు  ఈ- ఆఫీసు విధానం ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు అన్నారు. మహబూబ్ నగర్ రూరల్ ఎంపీడీవో కార్యాలయంలోలో ఈ - ఆఫీస్ విధానాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ- ఆఫీస్ విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇదివరకే జిల్లా కార్యాలయం పూర్తికాగా, తాసిల్దార్ కార్యాలయాలలో కూడా ఈ - ఆఫీస్ విధానం పూర్తయిందని తెలిపారు.

మండల స్థాయిలో వ్యవసాయ, విద్య, ఇంజినీరింగ్ కార్యాలయాల్లో కూడా ఈ- ఆఫీస్ విధానం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ కార్యాలయాలన్నింటిలో ఈ- ఆఫీస్ విధానం ప్రవేశపెడతామని చెప్పారు. ఈ- ఆఫీస్  విధానం వల్ల పారదర్శకతతో పాటు, ఫైల్ క్లియరింగ్  త్వరగా అవుతుందని, పాత తేదీలతో ఫైలు పంపించేందుకు అవకాశం ఉండదన్నారు.


logo