మంగళవారం 26 మే 2020
Telangana - May 04, 2020 , 13:43:40

వరంగల్‌లో ఉన్నతాధికారులకు మంత్రి ఎర్రబెల్లి సన్మానం

వరంగల్‌లో ఉన్నతాధికారులకు మంత్రి ఎర్రబెల్లి సన్మానం

వరంగల్‌ అర్బన్‌: కరోనా మహమ్మారిపై పోరులో విజయవంతంగా పనిచేస్తున్న వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఉన్నతాధికారులను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రి ఎర్రెబెల్లి దయాకర్‌ రావు సన్మానించారు. వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ రవీందర్‌, జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు, నగర మున్సిపల్‌ కమిషనర్‌ పమేలా సత్పతిలకు మంత్రి ఎర్రబెల్లి శాలువాలు కప్పి, పూలు చల్లి సత్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, వరంగల్‌ నగర మేయర్‌ పాల్గొన్నారు.    


logo