మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Oct 27, 2020 , 13:38:28

పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలి : మంత్రి ఎర్రబెల్లి

పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలి : మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : పెండింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. మంగళవారం పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల్లో పెండింగ్‌ ప‌నుల ప్రగతి, రైతు వేదిక‌ల నిర్మాణం, పీఎంజీఎస్‌వై రోడ్ల ప‌నుల‌పై ఉన్నతాధికారులతో మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో ఆయన స‌మీక్ష నిర్వహించారు.

నిర్ణీత ల‌క్ష్యానికి అనుగుణంగా ప‌నులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రైతు వేదిక‌లు, రోడ్లు, ఇత‌ర ప‌నుల‌న్నీ నాణ్యతా ప్రమాణాల‌క‌నుగుణంగా జ‌రిగేలా చూడాలని అన్నారు. అభివృద్ధి ప‌నుల్లో ఆల‌స్యం చేస్తే చర్యలు తప్పవని, అధికారులు క్షేత్రస్థాయిలో ప‌నులను ప‌ర్యవేక్షించాలని చెప్పారు. క‌రోనా నేప‌థ్యంలో ఆగిపోయిన ప‌నుల‌న్నీంటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.