హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): దేశం తీవ్రమైన టీకాల కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో స్పుత్నిక్-వీ ఆశాకిరణంగా మారింది. ఇప్పటికే 2.10 లక్షల డోసులు హైదరాబాద్‌కు వచ్చాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వీటిని దిగుమతి చేసుకున్నది. జూలై చివరినాటికి సుమారు 2 కోట్ల డోసులను రష్యా నుంచి దిగుమతి చేసుకోనున్నట్టు తెలిపింది. రెడ్డీస్ ల్యాబ్స్ దేశీయంగా టీకాల ఉత్పత్తి మొదలుపెట్టనున్నది. ఆగస్టు నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయని అంచనా. ఈ ఏడాది చివరినాటికి మొత్తంగా 15- 20 కోట్ల డోసులను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది.
జైడస్.. జెట్ స్పీడ్
గుజరాత్‌కు చెందిన దిగ్గజ ఫార్మా సంస్థ జైడస్ క్యాడిలా అభివృద్ధి చేస్తున్న ‘జైకోవ్-డీ’ వ్యాక్సిన్ తుది దశలో ఉన్నది. జూన్ లేదా జూలైలో అత్యవసర అనుమతులు వస్తాయని అంచనా వేస్తున్నారు. కేంద్రం అనుమతించగానే ఉత్పత్తి ప్రారంభించాలని క్యాడిలా భావిస్తున్నది.