e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News పల్లికొండ ప్రాజెక్టు లిఫ్ట్ సిద్ధం : మంత్రి వేముల

పల్లికొండ ప్రాజెక్టు లిఫ్ట్ సిద్ధం : మంత్రి వేముల

పల్లికొండ ప్రాజెక్టు లిఫ్ట్ సిద్ధం : మంత్రి వేముల

భీంగల్, వేల్పూర్/నిజామాబాద్‌ : జిల్లాలోని భీంగల్, వేల్పూర్ మండలాల్లో రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం పర్యటించారు. ముందుగా వేల్పూర్ మండలం జానకం పేట గ్రామం మల్లాడి చెరువుని పాత నిజాంసాగర్ కెనాల్ నుంచి నీళ్లను నింపే పనులను పరిశీలించారు. నిధుల మంజూరుకు కృషి చేస్తానని గ్రామమస్తులకు హామీ ఇచ్చారు.

అనంతరం పల్లికొండ(వేంగంటి) ప్రాజెక్టు కింద ఉన్న లిఫ్ట్ ను పరిశీలించారు. మోటర్ల పనితీరుఉ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ వర్షాకాలంలో నీటిని తోడేందుకు సిద్ధంగా ఉండాలని ఇరిగేషన్ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. పైప్ లైన్ లీకేజీలు, లిఫ్ట్ మోటర్ల చిన్న చిన్న మరమ్మతులు వారంలోగా పూర్తి చేసి నీటిని లిఫ్ట్ చేయడానికి సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పల్లికొండ చెరువును పరిశీలించారు.


ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సూచన మేరకు బాల్కొండ నియోజకవర్గంలో ని వేముగంటి, పల్లికొండ ఎత్తిపోతల పనులను పరిశీలించామన్నారు.
పల్లికొండ ఎత్తిపోతల పథకం ద్వారా దిగువన ఉన్న సుమారు 7 గ్రామాల చెరువులు నింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు.


సాగునీటికి సంబంధించిన కాలువల పరిశీలనకు వెళ్తుండగా మార్గమధ్యలో సర్వే చేస్తున్న ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలతో మంత్రి మాట్లాడారు. ఇంటింటి జ్వర సర్వే గురించి అడిగి తెలుసుకున్నారు. బాగా పనిచేస్తున్నారని వారిని ప్రశంసించారు. మంత్రి వెంట పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి..

కరోనాతో మేడారం పూజారి సమ్మారావు మృతి

ఆకతాయిలను ఐసోలేషన్‌కు పంపించిన పోలీసులు

అడవి శ్రీరాంపూర్‌లో కరోనాతో భార్యాభర్తలు మృతి

రైతులకు పనిముట్లను అందజేసిన మంత్రి అల్లోల

లాక్ డౌన్ కేసులు 11,746 : ఎస్పీ వెంకటేశ్వర్లు

మేడారం పూజారి మృతిపట్ల మంత్రి సత్యవతి సంతాపం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పల్లికొండ ప్రాజెక్టు లిఫ్ట్ సిద్ధం : మంత్రి వేముల

ట్రెండింగ్‌

Advertisement