శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 11:40:38

పచ్చదనం, పారిశుధ్యం ప్రాధాన్యంగా పల్లె ప్రగతి: మంత్రి ఎర్రబెల్లి

పచ్చదనం, పారిశుధ్యం ప్రాధాన్యంగా పల్లె ప్రగతి: మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్‌: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా పలు ప్రశ్నలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సమాధానమిస్తూ..పచ్చదనం, పారిశుధ్యం ప్రాధాన్యంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. 3 కోట్ల వరకు మొక్కలను పంపిణీ చేశాం. చెత్తను తొలగించడం, రోడ్లు, మురికికాలువలు శుభ్రపరచడం, పిచ్చి మొక్కలు తొలగింపునకు చర్యలు చేపట్డం జరిగింది. వైకుంఠధామం, డంప్‌ యార్డులు,నర్సరీలు నిర్మించడం జరిగింది. చెత్తను వేరు చేయడానికి చెత్తను తీసుకెళ్లేందుకు, మొక్కలకు నీళ్లు పోసేందుకు గ్రామపంచాయతీకి అవసరమైన ట్రాక్టర్లను కొనుగోలు చేశాం. ప్రతీ గ్రామపంచాయతీలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్డడం, ప్రతీ నెలా ప్రభుత్వం అన్ని గ్రామపంచాయతీలకు ఎన్‌ఆర్‌జీఎస్‌ గ్రాంట్ల నుంచి రాష్ట్రప్రభుత్వం నుంచి రూ.300 కోట్లను విడుదల చేస్తోంది. తెలంగాణకు హరితహారం కింద 2019-20 సంవత్సరంలో లక్షా 47వేల 261ప్రదేశాలను గుర్తించి 10 కోట్ల 90 లక్షల మొక్కలను నాటి, గృహాలలో మొక్కల పెంపకం కోసం 3 కోట్ల 16 లక్షల మొక్కలను పంపిణీ చేయడం జరిగింది. logo