గురువారం 04 జూన్ 2020
Telangana - Jan 27, 2020 , 01:50:03

‘పల్లెప్రగతి’ స్ఫూర్తితో ‘పాఠశాలప్రగతి’

‘పల్లెప్రగతి’ స్ఫూర్తితో ‘పాఠశాలప్రగతి’
  • మైనార్టీ గురుకులాల్లో ప్రారంభించిన టెమ్రీస్‌
  • విద్యార్థుల్లో సామాజిక బాధ్యత పెంపే లక్ష్యం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పల్లెప్రగతిని స్ఫూర్తితో అన్ని మైనార్టీ గురుకులాల్లోనూ ‘పాఠశాల ప్రగతి’ కార్యక్రమాన్ని తెలంగాణ మైనా ర్టీ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ (టెమ్రీస్‌) ప్రారంభించింది. విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా టెమ్రీస్‌ పరిధిలోని 204 గురుకుల పాఠశాలలు, 12 గురుకుల కాలేజీల్లో పాఠశాల ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 


ప్రతి శనివారం మధ్యా హ్నం 3ః30 నుంచి 4ః30 గంటల వరకు విద్యార్థులతోపా టు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, జూనియర్‌ లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. బడి పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. పాఠశాలల్లోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలను శుభ్రపరుచడంతోపాటు ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థి దశ నుంచే పిల్లలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తే, వారిఇంటితోపాటు గ్రామాలను కూడా  శుభ్రంగా ఉంచుకునేందుకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.


logo