శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 18:33:15

'పల్లె ప్రగతి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం విజయవంతం'

'పల్లె ప్రగతి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం విజయవంతం'

హైదరాబాద్‌:  గ్రామాల్లో పచ్చదనం-పరిశుభ్రత పెంచడం లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప‌ల్లె ప్ర‌గ‌తి ప్ర‌త్యేక పారిశుద్ధ్య కార్య‌క్ర‌మం దిగ్విజయంగా ముగిసింది. జూన్ 1 నుంచి 8వ తేదీ వ‌ర‌కు 8 రోజులపాటు నిరంత‌రాయంగా సాగిన ప్ర‌త్యేక పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలు విజయవంతమయ్యాయి.. రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు చొర‌వ‌తో చేసిన ప‌ర్య‌ట‌న‌లు, ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు అటు అధికారులు, ఇటు ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌జ‌ల్లోనూ ఉత్సాహాన్ని నింపాయి. 

పంచాయ‌తీల్లో స‌మావేశాలు, గ్రామాల్లో పాద‌యాత్ర‌లు, పారిశుద్ధ్యం, సుర‌క్షిత మంచినీటి స‌ర‌ఫ‌రా, దోమ‌ల నివార‌ణ‌, ప్ర‌భుత్వ‌, ఇత‌ర ప్రాంతాల ప‌రిశుభ్ర‌త‌, చెత్త సేక‌ర‌ణ వంటి ప‌లు అంశాల్లో ప‌ల్లె ప్ర‌గ‌తి ప్ర‌త్యేక పారిశుద్ధ్యాన్ని నిర్వ‌హించారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశంతో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు విస్తృతంగా ప‌ర్య‌టించారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీఎస్, స్థానిక సంస్థ‌ల ప్ర‌తినిధులు, అధికారులు, ప్ర‌జ‌లు ఈ ప్ర‌త్యేక పారిశుద్ధ్య కార్య‌క్ర‌మంలో భాగ‌స్వాముల‌య్యారు. ప్ర‌త్యేక పారిశుద్ధ్య కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప్ర‌తి ఒక్క‌రికీ మంత్రి ఎర్ర‌బెల్లి   కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 

ప‌ల్లె ప్ర‌గ‌తి ప్ర‌త్యేక పారిశుద్ధ్యంలో భాగంగా 12,766 గ్రామాల్లో స‌మావేశాలు నిర్వ‌హించారు. ఈ క‌రోనా స‌మ‌యంలోనూ నియంత్రిత ప‌ద్ధ‌తిలో సామాజిక‌, భౌతిక దూరాన్ని పాటిస్తూ, మాస్కులు ధ‌రించి 1,75,485 మంది ప్ర‌జ‌లు ఆయా స‌మావేశాల్లో పాల్గొన్నారు. 12,752 గ్రామ పంచాయ‌తీల్లో ప్ర‌జ‌లు, ప్ర‌జాప్ర‌తినిధులు క‌లిసి పాద‌యాత్ర‌లు నిర్వ‌హించి, స‌మ‌స్య‌లు గుర్తించి, వాటిని పరిష్కరించారు. 

మురుగునీటి కాలువ‌ల‌ను 81.26శాతం శుభ్ర‌ప‌రిచారు. స‌ర్కారు తుమ్మ‌, పిచ్చి చెట్ల‌ను  76.54శాతం నివారించారు. 70.37 శాతం శానిటేషన్ చేశారు. కాగా, 79.31శాతం మంచినీటి ట్యాంకుల‌ను క్లోరినేష‌న్ చేశారు. మంచినీటి స‌ర‌ఫ‌రా చానెల్స్ ని 78.84శాతం శుభ్రం చేశారు.   జూన్ 5వ తేదీన ఒక్క రోజే 88.16శాతం డ్రై డే ని పాటించ‌డం జ‌రిగింది. 80.78శాతం గ్రామాల్లో ఫాగింగ్ చేయ‌డం జ‌రిగింది. అంగ‌న్ వాడీ కేంద్రాల్లో 81.21శాతం, ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల్లో 81.78శాతం, ప్రాథ‌మికోన్న‌త పాఠ‌శాల‌ల్లో 82.90శాతం, హై స్కూల్స్ లో 80.62శాతం పారిశుద్ధ్యం నిర్వ‌హించారు. 

అనివార్య కార‌ణాల వ‌ల్ల పూర్తి కాని, మిగ‌తా ప‌నుల‌ను మ‌రో మూడు రోజుల్లో పూర్తి చేయాల్సిందిగా మంత్రి ఎర్ర‌బెల్లి  అధికారుల‌ను ఆదేశించారు. అలాగే ప‌ల్లె ప్ర‌గ‌తి స్ఫూర్తిని కొన‌సాగించాల‌ని మంత్రి ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌జ‌లు, అధికారులను కోరారు. 


logo