ఆదివారం 17 జనవరి 2021
Telangana - Jan 13, 2021 , 01:56:22

మతతత్వ పార్టీలకు గుణపాఠం చెప్పాలి

మతతత్వ పార్టీలకు గుణపాఠం చెప్పాలి

  • రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి

ఆలేరు టౌన్‌, జనవరి 12: మతం పేరుతో బీజేపీ నాయకులు రాజకీయాలను భ్రష్ఠుపట్టిస్తున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఆలేరు పట్టణంలో, యాదగిరిగుట్టలో మంగళవారం నిర్వహించిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశాల్లో ఆయన మాట్లాడారు. మతతత్వ పార్టీలకు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేసిందన్నారు. త్వరలో 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల అవుతాయన్నారు. కార్యక్రమంలో విప్‌ గొంగిడి సునీత, జెడ్పీ చైర్మన్‌ సందీప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.