శనివారం 30 మే 2020
Telangana - May 10, 2020 , 01:07:40

పాలమూరు రూపురేఖలు మారుస్తాం

పాలమూరు రూపురేఖలు మారుస్తాం

ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

జడ్చర్ల : పాలమూరు రూపురేఖలను మార్చేందుకే సీఎం కేసీఆర్‌ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మంజూరుచేశారని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండ లం ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు దేవునిగుట్ట తండా దగ్గర ఎంపిక చేసిన స్థలాన్ని శనివారం జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉదండాపూర్‌ రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న ఉదండాపూర్‌, వల్లూరు గ్రామాల ప్రజలకు పరిహారం అందించడంతోపాటు, అన్ని సౌకర్యాలతో కూడిన పునరావాసం కల్పిస్తామన్నారు.


logo