మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Aug 29, 2020 , 20:23:27

మత్స్య సంపదకు పుట్టినిల్లుగా పాలమూరు : మ‌ంత్రి శ్రీ‌నివాస్ గౌడ్‌

మత్స్య సంపదకు పుట్టినిల్లుగా పాలమూరు : మ‌ంత్రి శ్రీ‌నివాస్ గౌడ్‌

మహబూబ్‌న‌గ‌ర్ : ఉమ్మడి పాలమూరు జిల్లా మత్స్య సంపదకు పుట్టినిల్లుగా మారబోతోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో మహబూబ్‌న‌గ‌ర్ రూరల్ మండలం జమిస్తాపూర్ వరదరాజు చెరువు, దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ రిజర్వాయర్‌లో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్. రాజేందర్ రెడ్డితో కలిసి మంత్రి శ‌నివారం చేప పిల్లలు వదిలారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్య కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటుంద‌న్నారు. రాబోయే రోజుల్లో రాష్ర్టంలో మరింత మత్స్యసంపద పెరగనుందన్నారు. అన్ని కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకురావాలనేదే తమ లక్ష్యమన్నారు. గ్రామాలలో ప్రతి ఒక్కరికి ప్రయోజనం చేకూర్చాల‌న్న‌దే చేయాలనేది తమ ఉద్దేశ్యమన్నారు.   

టూరిజం స్పాట్‌గా కోయల్ సాగ‌ర్‌...

సహజసిద్ధమైన అందాలతో అలరారుతున్న కోయల్ సాగర్ రిజర్వాయర్‌ను టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కోయిల్ సాగర్, కోయిలకొండ, మహబూబ్ నగర్ ను పర్యాటక సర్క్యూట్‌లా అభివృద్ధి చేస్తామన్నారు. టూరిజం ఎండీ మనోహర్‌తో పాటు పలువురు కన్సల్టెంట్లతో మంత్రి, ఎమ్మెల్యేలు కోయిల్ సాగర్ వద్ద ప్రాంతాలను పరిశీలించారు. హరిత హోటల్, హట్స్, కాటేజీలు, బోటింగ్ తదితర ప‌ర్యాట‌క ఆక‌ర్ష‌ణలు కోయిల్ సాగర్‌కు మరింత వన్నె తీసుకువస్తాయన్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేయాల్సిందిగా ఎండీ మనోహర్‌ను ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మంలో జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షులు  సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.logo