శుక్రవారం 05 మార్చి 2021
Telangana - Jan 21, 2021 , 19:06:23

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్‌) పదిశాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల బ్రహ్మణ సేవా సమితి హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసింది. ఈడబ్ల్యూఎస్‌ అమలుతో ఖమ్మ, రెడ్డి, వెలమ, వైశ్య, బ్రాహ్మణ వంటి అగ్ర వర్ణాలలోని పేదలకు విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో అవకాశాలు లభిస్తాయన్నారు. భారత ప్రభుత్వం, సుప్రీంకోర్టు సమర్థించిన ఈడబ్ల్యూఎస్‌ ప్రకారంగా 10 శాతం రిజర్వేషన్లను అమలు పర్చాలని నిర్ణయం తీసుకోవడం పట్ల సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర అధికారులు, జిల్లాస్థాయి కలెక్టర్లకు తగు మార్గదర్శకాలు జారీచేయాల్సిందిగా కోరారు. సీఎం కేసీఆర్‌ ఇప్పటికే బ్రహ్మణ సంక్షేమం పట్ల నిధులు కేటాయించి వారి అభ్యున్నతికి తోడ్పడ్తున్నారని బ్రహ్మణ సేవా సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు. 

VIDEOS

logo