గురువారం 09 జూలై 2020
Telangana - Jun 17, 2020 , 00:40:38

సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం

సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: వానకాలం పెట్టుబడి సాయాన్ని వారం రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా రైతులు, రైతుబంధు సమితి కోఆర్డినేటర్లు, ప్రజాప్రతినిధులు సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, నాగర్‌కర్నూ ల్‌ జిల్లా అచ్చంపేటలో ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం చందుపట్లలో, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల, ఆదిలాబాద్‌లో, జగిత్యాల జిల్లాల్లో సీఎం చిత్రపటాలను పాలతో అభిషేకించారు.  


logo