బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 28, 2020 , 13:25:24

ఘ‌నంగా పైడి జ‌య‌రాజ్ 111వ జ‌యంతి వేడుక‌లు

ఘ‌నంగా పైడి జ‌య‌రాజ్ 111వ జ‌యంతి వేడుక‌లు

హైద‌రాబాద్ : తెలంగాణ గర్వించదగ్గ నటుడు, దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత, బాలీవుడ్ మొట్ట మొదటి సూపర్ స్టార్, కరీంనగర్ ముద్దుబిడ్డ దివంగత ప్రముఖ నటుడు శ్రీ పైడి జయరాజ్ 111వ జయంతి వేడుక‌లు రవీంద్రభారతిలో ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల్లో మంత్రులు శ్రీనివాస్ గౌడ్‌, గంగుల క‌మ‌లాక‌ర్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా పైడి జ‌య‌రాజ్ చిత్ర‌ప‌టానికి మంత్రులు పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. 

అనంత‌రం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఉమ్మ‌డి రాష్‌ర్టంలో తెలంగాణ‌కు చెందిన క‌వులు, క‌ళాకారులు, సాహితీవేత్త‌ల‌ను విస్మ‌రించారు. దేశం గ‌ర్వించ‌ద‌గిన నటుడు పైడి జ‌య‌రాజ్ జ‌యంతి, వ‌ర్ధంతి వేడుక‌ల‌ను ప్ర‌భుత్వం ఘ‌నంగా నిర్వ‌హిస్తోంద‌న్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు తెలంగాణకు చెందిన క‌వులు, క‌ళాకారులతో పాటు ప్ర‌ముఖుల‌ను గుర్తించి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ త‌ర‌పున వారి జ‌యంతి, వ‌ర్ధంతి వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ వేడుక‌ల‌కు వారి కుటుంబ స‌భ్యుల‌ను పిలిచి గౌర‌విస్తున్నామ‌ని చెప్పారు. ర‌వీంద్ర భార‌తిలోని ప్రివ్యూ థియేట‌ర్‌కు పైడి జ‌య‌రాజ్ పేరు పెట్టి గౌర‌విస్తున్నామ‌ని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ పేర్కొన్నారు. 


logo