శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Sep 23, 2020 , 01:43:21

కల్యాణలక్ష్మి లబ్ధిదారులు 7 లక్షలు

కల్యాణలక్ష్మి లబ్ధిదారులు 7 లక్షలు

  • కష్టకాలంలోనూ అందుబాటులో నిధులు
  • పేదిండ్లలో సంబురంలా ఆడబిడ్డ పెండ్లి
  • రూ.5,556.54 కోట్లు చెల్లింపు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నిరుపేద కుటుంబాల ఆడపిల్లల పెండ్లి ఖర్చుల కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి/ షాదీముబారక్‌ పథకాల కింద ఇప్పటివరకు లబ్ధిపొందినవారి సంఖ్య 7 లక్షలు దాటింది. ఆడపిల్లల తల్లిదండ్రులు పడుతున్న అగచాట్లను అర్థంచేసుకున్న సీఎం కేసీఆర్‌ 18 ఏండ్లు నిండిన యువతుల పెండ్లికి ఆర్థికంగా చేయూతనందించేందుకు ఈ పథకం అమలుచేస్తున్నారు. దీనిద్వారా రాష్ట్రంలో సెప్టెంబర్‌ 18వ తేదీనాటికి 7,14,575 మంది ఆడపిల్లలకు లబ్ధిచేకూరింది. ఇందుకు ప్రభుత్వం రూ.5,556.54 కోట్లు వెచ్చించింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీవర్గాలకు ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం ముందే నిధులు సమకూర్చింది. కరోనా నేపథ్యంలో పెండ్లళ్లు అతి తక్కువ సంఖ్యలో జరుగుతున్నప్పటికీ ఈ పథకం ద్వారా ఆర్థికచేయూతకు వచ్చి దరఖాస్తుల ఆధారంగా ప్రభుత్వం ఆయా శాఖలవారీగా చెల్లింపునకు ఇప్పటివరకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2,012.07 కోట్లు విడుదలచేసింది. ఇందులో సెప్టెంబర్‌ 18 వరకు రూ.807.42 కోట్లు చెల్లింపులు జరిగాయి. నిబంధనల ప్రకారం పెండ్లిచేసుకున్న యువతులకు ఈ పథకం కింద రూ.1,00,116 ఆర్థికచేయూత అందిస్తున్నారు.