గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 11:04:43

దాశరథి కృష్ణమాచార్య జయంతి.. కవిత ఘన నివాళి

దాశరథి కృష్ణమాచార్య జయంతి.. కవిత ఘన నివాళి

హైదరాబాద్‌ : మహాకవి దాశరథి కృష్ణమాచార్య 96వ జయంతిని పురస్కరించుకుని టీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ ఎంపీ కవిత ఘన నివాళులర్పించారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తన రచనలతో తెలంగాణ అస్థిత్వపు భావజాలాన్ని నలుదిశలా చాటిన సాహితీ యోధుడు దాశరథి కృష్ణమాచార్య అని కవిత ట్వీట్‌ చేశారు. 

1925 జూలై 22వ తేదీన ఉమ్మడి వరంగల్‌ జిల్లా చిన్నగూడూరు గ్రామంలో దాశరథి జ‌న్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ డిగ్రీ పట్టా పొందిన ఆయన తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. చిన్నతనంలోనే పద్యరచనలో ప్రావీణ్యం సంపాదించారు.


logo