హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): సమాజ సేవా రంగంలో కృషి చేస్తున్న సుప్రీం కోర్టు అడ్వకేట్, తెలంగాణ ఉద్యోగుల సంఘం చైర్మన్, విశ్వకర్మ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు ఏ పద్మాచారికి ప్రతిష్ఠాత్మక ‘భారత్ సమాజ సేవ రత్న-2026’ అ వార్డు దక్కింది. ఢిల్లీలో ఆల్ మీడియా కౌ న్సిల్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి మురళీ మనోహర్ జోషి ఈ అవార్డును పద్మాచారికి అందజేశారు.