శుక్రవారం 03 జూలై 2020
Telangana - Apr 05, 2020 , 10:34:33

తాత్కాలిక షెల్టర్‌ కేంద్రాన్ని పరిశీలించిన పద్మారావు గౌడ్‌

తాత్కాలిక షెల్టర్‌ కేంద్రాన్ని పరిశీలించిన పద్మారావు గౌడ్‌

హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించొద్దన్న ప్రభుత్వ ఆశయాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు క్షేత్రస్థాయిలో కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా నగరంలోని లాలాపేట సమీపంలో గల ప్రొఫెసర్‌ జయశంకర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెల్టర్‌ సెంటర్‌ను డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ ఈ ఉదయం సందర్శించారు. ఈ కేంద్రంలో ఇండ్లులేని నిరాశ్రయులైన 250 మందికి ఆశ్రయం కల్పించారు. వీరందరికి రోజుకు మూడు పూటల ఆహారాన్ని ఉచితంగా అందజేస్తున్నారు. వీరికి అందుతున్న సదుపాయాలను, యోగక్షేమాలను డిప్యూటీ స్పీకర్‌ అడిగి తెలుసుకున్నారు. డిప్యూటీ స్పీకర్‌ వెంట కార్పొరేటర్‌ హేమ, కత్తి కార్తీక, పలువురు అధికారులు ఉన్నారు.ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo