ధాన్యం కొనుగోళ్లు 43 లక్షల టన్నులు

- పది రోజుల్లో ముగియనున్న కొనుగోళ్ల ప్రక్రియ
- నిజామాబాద్‌లో ఎక్కువ.. ఆదిలాబాద్‌లో తక్కువ
- రైతుల ఖాతాల్లో రూ.7 వేల కోట్లు జమ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో వానకాలం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మరో పదిరోజుల్లో ముగియనున్నది. ఇప్పటివరకు పౌరసరఫరాలశాఖ 42.72 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఇందులో 16.50 లక్షల టన్నులు సన్నరకం కాగా, 26.22 లక్షల టన్నులు దొడ్డు రకం ఉన్నాయి. పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 6,491 కేంద్రాలను ఏర్పాటుచేసింది. గతేడాది వానకాలంసీజన్లో పౌరసరఫరాలశాఖ సుమారు 47 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఈసారి కొనుగోళ్ల ప్రక్రియ మరో పదిరోజులపాటు జరిగే అవకాశం ఉండటంతో గతేడాది కొనుగోళ్లను దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 7 లక్షల నుంచి 8 లక్షల టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉన్నదని, మొత్తం 50 లక్షల టన్నులకు చేరువకావొచ్చని పేర్కొంటున్నారు.
సన్నాలు సైతం
గతంతో పోల్చితే ప్రభుత్వం సన్నరకం ధాన్యాన్ని కూడా అధికంగానే కొనుగోలు చేసింది. గతేడాది వానాకాలంలో సుమారు 14 లక్షల టన్నుల సన్నాలను సేకరించగా.. ఈ సీజన్లో ఇప్పటికే 16.50 లక్షల టన్నులు కొనుగోలు చేసింది.
నిజామాబాద్‌లో 5.79 లక్షల టన్నులు
ధాన్యం కొనుగోళ్లలో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉండగా.. ఆదిలాబాద్ జిల్లా చివరన నిలిచింది. నిజామాబాద్ జిల్లాలో 5.79 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. కామారెడ్డి జిల్లాలో 3.75 లక్షల టన్నులు, నల్లగొండలో 2.90 లక్షల టన్నులు, ఆదిలాబాద్ జిల్లాలో అతి తక్కువగా 1,043 టన్నుల కొనుగోళ్లు జరిగాయి. ఇప్పటివరకు 9.63 లక్షల మంది రైతుల నుంచి రూ.8 వేల కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయగా.. రూ.7,018 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసింది.
తాజావార్తలు
- కొవిడ్-19 : మేజికల్ స్ప్రేపై పరీక్షలు
- లిప్‌లాక్ సీన్ కు లావణ్యత్రిపాఠి ఒకే..?
- ఇకపై ప్రతి నెలా టెస్ట్ క్రికెట్లో బెస్ట్ ప్లేయర్ అవార్డు
- ఎర్రకోటపై దాడి.. రైతులను రెచ్చగొట్టింది ఇతడేనా?
- పూజాహెగ్డే డిమాండ్..మేకర్స్ గ్రీన్ సిగ్నల్..!
- ఇండియాలో ఉద్యోగులను తొలగిస్తున్న టిక్‌టాక్
- కారు, లారీ ఢీ.. ఐదుగురు దుర్మరణం
- చరిత్రలో ఈ రోజు.. కరెంటు బుగ్గకు పేటెంట్ దక్కిందీరోజే..
- బాండ్ స్కామ్ : గోల్డ్‌మన్ సీఈవో వేతనంలో భారీ కోత
- చెన్నై చేరిన ఇంగ్లండ్ క్రికెటర్లు..