గురువారం 26 నవంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 21:54:07

చ‌ర్ల‌ప‌ల్లి, గుల్ల‌కోట‌లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

చ‌ర్ల‌ప‌ల్లి, గుల్ల‌కోట‌లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

జ‌గిత్యాల : జిల్లాలోని వెల్గటూర్ మండలం చర్లపల్లి, గుల్లకోట గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ర్ట సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శ‌నివారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా చర్లపల్లి వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు మంత్రికి ఒడి వడ్లు పోశారు. అనంతరం మండలానికి చెందిన క‌ల్యాణ‌ల‌క్ష్మీ, షాదీముబార‌క్ ల‌బ్దిదారులు 16 మందికి మంజూరు అయిన రూ. 17,03,624 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.