ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 15, 2020 , 17:18:52

‘ఉపాధి’లో కల్లాల నిర్మాణం

‘ఉపాధి’లో కల్లాల నిర్మాణం

హైదరాబాద్‌ : జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో రైతుల సౌకర్యార్థం రాష్ట్రవ్యాప్తంగా కల్లాలు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు రూ.750 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపింది. 50, 60, 75 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కల్లాలు నిర్మిస్తామని, రూ.56వేలు, రూ.68వేలు, రూ.85వేల యూనిట్లతో కల్లాల నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొంది. స్వయం సహాయక సంఘాల సభ్యులు, రైతులకు చెందిన స్థలాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా నిర్మించి ఇస్తామని, మిగతా రైతులు 10శాతం చెల్లిస్తే సరిపోతుందని వివరించింది.


logo