గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 17, 2020 , 01:52:10

ఓజోన్‌ రక్షణ అందరి బాధ్యత: మంత్రి అల్లోల

ఓజోన్‌ రక్షణ అందరి బాధ్యత: మంత్రి అల్లోల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వాతావరణంలో సహజ రక్షణ పొరగా ఉన్న ఓజోన్‌ పొరను పరిరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని అటవీ, పర్యావరణ, న్యాయశాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ ఓజోన్‌ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. భూగోళంపై కవచంలా ఉంటూ ఓజోన్‌పొర సమస్త జీవకోటికి రక్షణ కల్పిస్తున్నదన్నారు. ప్రకృతిలో భాగమైన ఓజోన్‌ పొర లేకుండా జీవితం సాధ్యంకాదని, అందుకే ఈ ఏడాది ‘మన జీవితం కోసం ఓజోన్‌' అనే నినాదాన్ని ఇచ్చారన్నారు. ఓజోన్‌ రక్షణ కోసం వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హరితహారంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. కార్బన్‌ కారకాల వినియోగాన్ని తగ్గిస్తే పర్యావరణానికి మేలు జరుగుతుందని మంత్రి చెప్పారు.


logo