బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 12, 2020 , 22:49:10

భవిష్యత్‌లో ఆక్సిజన్‌ కొనుక్కునే పరిస్థితి రావొద్దు

భవిష్యత్‌లో ఆక్సిజన్‌ కొనుక్కునే పరిస్థితి రావొద్దు

హైదరాబాద్‌: ఇప్పటికే మనం నీరు కొనుక్కొంటున్నాం.. భవిష్యత్తులో ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని సినీ నటుడు సామ్రాట్‌ పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన సామ్రాట్‌ ఆదివారం హైదరాబా‌ద్‌లో మొక్కను నాటారు. 

ప్రతిరోజూ ఆఫీసుకు  వెళ్లే సమయంలో నాటిన మొక్కను రక్షించే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించిన హరితహారం బ్రహ్మాండంగా విజయవంతమైందని   అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్విరామంగా,యజ్ఞంలా ముందుకు సాగుతుందని సామ్రాట్‌ అన్నారు. 

అదేవిధంగా  ప్రముఖ సినీనటి సమంత అక్కినేని విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ శిల్పా రెడ్డి ఈ రోజు తన నివాసంలో మూడు మొక్కలను నాటారు.మొక్కలను ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తే రాబోవు తరాల వారికి ఒక గొప్ప బహుమతి ఇచ్చిన వారిమౌవుతామని ఆమె అన్నారు. తననీ భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్‌కు, సినీనటి సమంత కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శిల్పారెడ్డి మరో నలుగురిని గ్రీన్ ఛాలెంజ్ కి నామినేట్ చేశారు.అందులో అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల,సుస్మిత కొణిదెల, మంచు లక్ష్మీ, సామ్రాట్ ఉన్నారు.logo