శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Aug 31, 2020 , 01:57:29

టిమ్స్‌లో ఆక్సిజన్‌ కొరత.. అబద్ధం

టిమ్స్‌లో ఆక్సిజన్‌ కొరత.. అబద్ధం

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి టిమ్స్‌ దవాఖానలో ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది. దీంతో కొవిడ్‌ బాధితులు అవస్థలు పడుతున్నారు. ఇలాంటి వార్త ఒకటి ఆదివారం ప్రసార మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసింది.

వాస్తవం 

టిమ్స్‌లో ఆక్సిజన్‌ కొరత లేదని అక్కడే చికిత్స పొందుతున్న రాజేందర్‌ తెలిపారు. ‘కొరత ఉన్నదని ఎవరు చెప్పారు మీకు?.. నేను ప్రస్తుతం టిమ్స్‌లోనే చికిత్స పొందుతున్నా. అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి ఆక్సిజన్‌ అందిస్తున్నారు. డాక్టర్లు చేస్తున్న సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే’ అని రాజేందర్‌ ట్విట్టర్‌ ద్వారా వాస్తవాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు.  logo