సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 31, 2020 , 14:26:41

దవాఖానలో ఆక్సిజన్ సిలిండర్ లీక్.. పరుగులు తీసిన రోగులు

దవాఖానలో ఆక్సిజన్ సిలిండర్ లీక్.. పరుగులు తీసిన రోగులు

జోగులాంబ గద్వాల : జిల్లా కేంద్రంలోని గద్వాల ప్రభుత్వ ఏరియా దవాఖానలోని చిన్న పిల్లల వార్డులో అకస్మాత్తుగా ఆక్సిజన్ సిలిండర్ లీక్ కావడంతో భయాందోళనలకు గురైనా రోగులు పరుగులు తీశారు. ఏరియా దవాఖానలోని రోగుల కథనం మేరకు..గద్వాల పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలోని చిన్న పిల్లల వార్డులో అకస్మాత్తుగా ఆక్సిజన్ సిలిండర్ లో పొగలు రావటంతో చికిత్స పొందుతున్న రోగులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. 

కాగా, గద్వాల మండలం శెట్టి ఆత్మకూరు గ్రామనికి చెందిన కృష్ణ పొద్దున షుగర్ లెవల్ తగ్గాయని దవాఖానలో చేరాడు‌. అతడిని వైద్య సిబ్బంది వెంటిలేషన్ పై ఉంచారు. గ్యాస్ లీకైందని భయాందోళనకు గురైన కృష్ణయ్య సైతం బయటకి వచ్చి మళ్లీ తిరిగి వెళ్లి లోపలే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. చాలా మంది రోగులు వెంటిలేటర్ (సెలైన్ బాటిల్) తో బయటకు వచ్చి చెట్ల కిందా కూర్చున్నారు. 


సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడి చేరుకుని ఎలాంటి ప్రమాదం లేదని తెలుసుకున్న తర్వాత అక్కడ నుంచి వెళ్లారు. సంఘటన స్థలాని సూపరింటెండెంట్ డాక్టర్ శోభారాణి, గద్వాల పట్టణ ఎస్ఐ సత్యనారాయణ పరిశీలించారు. గందరగోళం తర్వాత రోగులు తమ వార్డుల్లోకి వెళ్లి చికిత్స పొందుతున్నారు.


logo