ఆవుకు 'సీమంతం'.. ఆనందానికి అవధులు లేవు

- కూతురు లేని ఆ ఇంటికి ఆడబిడ్డ అయిన ఆవు
- అల్లారుముద్దుగా సాదుకుంటున్న దంపతులు
- వైభవంగా సీమంత వేడుక
- ధరణి సాయి సేవా సంఘ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
కూతురు లేని ఆ ఇంటికి గోమాత ఆడబిడ్డ అయింది. సొంత కూతురిలా పెంచుకుంటున్నారు. ఆవు గర్భం దాల్చిందని తెలియడంతో వారి ఆనందానికి అవధులు లేవు. వైభవంగా సీమంతం చేశారు హన్మకొండ ఎస్బీహెచ్ కాలనీలోని పీజేఆర్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న పాశికంటి వీరేశం, శోభ దంపతులు.
- హన్మకొండ సిటీ, జనవరి17
గోవులను అమితంగా ప్రేమించే వీరేశం దంపతులకు నలుగురు కొడుకులు. ఆడబిడ్డ లేదనే దిగులు వారిని వెంటాడుతుండేది. ఆవులను ఇష్టపడే వీరేశం, తన రెండో కొడుకు శ్రావణ్‌కుమార్ నెల రోజుల క్రితం గీసుగొండ అంగట్లో రూ.30,000 వెచ్చించి ఆవును కొనుగోలు చేశారు. దానికి కోసం ఖాళీ స్థలాన్ని లీజుకు తీసుకొని సొంత కూతురిలా పెంచుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఆవు గర్భం దాల్చిందని తెలియడంతో హిందూ సంప్రదాయ పద్ధతిలో సీమంతం చేశారు.
వరంగల్‌కు చెందిన ధరణి సాయి సేవా సంఘ్ కొంత కాలంగా కరీమాబాద్‌లోని గోశాలల్లో ప్రతి శుక్రవారం గోవులకు గడ్డి అందిస్తున్నారు. వీరేశం దంపతులు పెంచుకుంటున్న ఆవు గర్భం దాల్చిందని తెలుసుకున్న సభ్యులు సీమంతం చేయాలని నిర్ణయించి వీరేశం దంపతులకు చెప్పారు. వారి అంగీకారంతో ఆదివారం ఎస్బీహెచ్ కాలనీలోని గోమాత ఉండే స్థలంలోనే వరంగల్ కాశీబుగ్గ రామాలయం పూజారి మధుచారి సమక్షంలో ఆవుకు సీమంతం నిర్వహించారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఆవుకు గాజులు, పూలు, పండ్లు, చీరె, పసుపు, కుంకుమ పెట్టి వైభవంగా వేడుక జరిపారు.
తాజావార్తలు
- అమానుషం.. ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన ఆడశిశువు
- ఇంధన ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ.. ఒంటి గంట వరకు వాయిదా
- పవర్ ఫుల్ ఉమెన్స్‌తో వకీల్ సాబ్.. పోస్టర్ వైరల్
- భారత్‌కు ఎగువన బ్రహ్మపుత్రపై డ్యామ్స్.. చైనా గ్రీన్‌సిగ్నల్
- మెదక్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి
- మెన్స్ డేను కూడా సెలబ్రేట్ చేయాలి : ఎంపీ సోనాల్
- ఉమెన్స్ డే స్పెషల్: విరాట పర్వం నుండి అమెజింగ్ వీడియో
- మునగాలలో అదుపుతప్పి బోల్తాపడ్డ కారు.. మహిళ మృతి
- రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు: మహేష్