సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 02:06:19

సొంతంగా బొటానికల్‌ గార్డెన్‌

సొంతంగా బొటానికల్‌ గార్డెన్‌

మహాబూబ్‌నగర్‌ ప్రతినిధి/ నమస్తే తెలంగాణ: జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సదాశివయ్య వృక్షశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. కాలేజీలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతూ, సొంతంగా బొటానికల్‌ గార్డెన్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ మ్యాప్‌ రూపంలో బొటానికల్‌ గార్డెన్‌ను ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ‘సాక్షాత్తు సీఎం నాకు ఫోన్‌ చేస్తారని అస్సలు ఊహించలేదు. ఇది కలా! నిజమా! అన్నది అర్థం కావటం లేదు. ముందురోజే సీఎం కేసీఆర్‌ వచ్చి మా కళాశాల గార్డెన్‌లో మొక్కలు నాటినట్టు కల వచ్చింది. ఇదే విషయాన్ని మా విద్యార్థులకు కూడా చెప్పా. కానీ, సాయంత్రమే సీఎం కేసీఆర్‌  ఫోన్‌ చేయడం సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు. శుక్రవారం సీఎంను కలవబోతుండటం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.logo