గురువారం 09 ఏప్రిల్ 2020
Telangana - Mar 02, 2020 , 01:06:44

పథకం ప్రకారమే ఢిల్లీ అల్లర్లు

పథకం ప్రకారమే ఢిల్లీ అల్లర్లు
  • అమానుష ఘటనలకు ప్రధానిదే బాధ్యత: అసదుద్దీన్‌ ఒవైసీ
  • తెలంగాణలో ఎన్పీఆర్‌ను నిలిపివేయాలని కేసీఆర్‌కు విన్నపం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పక్కా పథకం ప్రకారమే ఢిల్లీలో అల్లర్లు జరిగాయని మజ్లిస్‌ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పునరుద్ఘాటించారు. ఢిల్లీలో జరిగిన అమానుష ఘటనలకు ప్రధాని నరేంద్రమోదీ బాధ్యత వహించాలని డిమాండ్‌చేశారు. ఎంఐఎం 62వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆదివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం దారుసలాంలో  నిర్వహించారు. ఈ సందర్భంగా అసద్‌ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నివాసానికి కూతవేటు దూరంలో జరిగిన అల్లర్లపై ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.ప్రధానికి నిజంగా బాధ్యత ఉంటే వెంటనే అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని సవాల్‌ విసిరారు. ఢిల్లీలో చెలరేగినవి మత కలహాలు కావని, బీజేపీ నాయకులు పథకం ప్రకారం విద్వేషాలు రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించారని ఆరోపించారు. తెలంగాణలో జాతీయ పౌర పట్టిక (ఎన్పీఆర్‌)ను అమలుచేయకుండా నిలిపివేయాలని ఆయన సీఎం కేసీఆర్‌కు మరోసారి విజ్ఞప్తిచేశారు. మరోవైపు, ఢిల్లీ అల్లర్లలో మరణించినవారి కుటుంబసభ్యులకు ఆర్థికసాయం అందించాలని ఎంఐఎం పార్టీ నిర్ణయించింది.
logo