ఆదివారం 29 మార్చి 2020
Telangana - Feb 24, 2020 , 00:30:41

ఓవరాల్‌ చాంప్‌ తెలంగాణ

ఓవరాల్‌ చాంప్‌ తెలంగాణ
  • ట్రోఫీలు అందజేసిన మంత్రులు హరీశ్‌ రావు, కమలాకర్‌

కరీంనగర్‌ స్పోర్ట్స్‌: జాతీయస్థాయి కరాటే చాంపియన్‌షిప్‌ చీఫ్‌ మినిస్టర్‌ కప్‌-2020లో అద్భుత ప్రదర్శన చేసిన తెలంగాణ జట్టు ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచింది. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ స్టేడియంలో ఆదివారం చివరి రోజు పోటీలు జరుగగా.. ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ముఖ్య అతిథులుగా హాజరై, విజేతలకు బహుమతులు అందజేశారు. మొత్తం 370 పాయింట్లు, 152 పతకాలతో తెలంగాణ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంటే, ఆంధ్రప్రదేశ్‌ (131 పతకాలు), మధ్యప్రదేశ్‌ (79) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ముగింపు కార్యక్రమంలో నిర్వాహకులు చల్లా హరిశంకర్‌, ఈ శ్రీనివాస్‌, మాడుగుల ప్రవీణ్‌కుమార్‌, ప్రసన్నకుమార్‌, జిల్లా ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు నందెల్లి మహిపాల్‌, రాష్ట్ర ఒలింపిక్‌ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గసిరెడ్డి జనార్దనరెడ్డి, కాయ్‌ ప్రధాన కార్యదర్శి గౌరు రాజిరెడ్డి, కరాటే సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


logo