సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 11, 2020 , 03:52:34

ఔట్‌సోర్సింగ్‌ నర్సుల జీతాల పెంపు

ఔట్‌సోర్సింగ్‌ నర్సుల జీతాల పెంపు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా కష్టకాలంలో ధైర్యంగా విధులు నిర్వర్తిస్తున్న ఔట్‌సోర్సింగ్‌ నర్సింగ్‌ సిబ్బంది జీతాలను ప్రభుత్వం సోమవారం  పెంచింది. దీనితో  డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోని నర్సింగ్‌, నిమ్స్‌ దవాఖానల్లో పనిచేస్తున్న సిబ్బంది వేతనాలు రూ.17,500 నుంచి రూ.25,140కు పెరిగాయి. కొవిడ్‌ విధి నిర్వహణలో సిబ్బంది మరింత చురుకుగా పనిచేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం పేర్కొన్నది. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఔట్‌సోర్సింగ్‌ నర్సింగ్‌ సిబ్బంది అధ్యక్షుడు ఎం నర్సింహ హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌, మంత్రి ఈటలకు కృతజ్ఞతలు తెలిపారు.


logo