బుధవారం 03 జూన్ 2020
Telangana - May 20, 2020 , 21:27:17

ఔటర్‌పై.. రయ్‌ రయ్‌

ఔటర్‌పై.. రయ్‌ రయ్‌

హైదరాబాద్‌: ఔటర్‌ రింగ్‌రోడ్డుపై వాహనాల రాకపోకలకు బుధవారం నుంచి అనుమతించారు. లాక్‌డౌన్‌తో మూసివేసిన ఈ రహదారిపై కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి వాహనాల రాకపోకలను అనుమతించినట్లు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. అయితే, రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు కర్వూ సమయంలో వాహనాలను అనుమతించబోమని స్పష్టంచేశారు. ఔటర్‌ టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సరుకు రవాణా వాహనాల్లో మనుషులను రవాణా చేస్తే వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని టోల్‌ప్లాజాల సిబ్బందిని ఆదేశించారు.

ఔటర్‌పై భారీ వాహనానలకు 24 గంటలపాటు రాకపోకలకు అనుమతించారు. ఓఆర్‌ఆర్‌పై కుడివైపు రెండు లేన్లలో 100 కిలోమీటర్ల వేగంలోపు, ఎడమ వైపు రెండు లేన్లలో 80 కిలోమీటర్లలోపు వేగంతో వాహనాలు ప్రయాణించాలని సూచించారు. అంతకుమించి వేగంగా వెళ్లే వాహనాలను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. 


logo