గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 17:24:15

గాంధీలో న‌ర్సుల స‌మ్మె విర‌మ‌ణ‌

గాంధీలో న‌ర్సుల స‌మ్మె విర‌మ‌ణ‌

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని గాంధీ ఆస్ప‌త్రిలో ప‌ని చేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందితో రాష్ర్ట ప్ర‌భుత్వం జ‌రిపిన చ‌ర్చ‌లు ఎట్ట‌కేల‌కు స‌ఫ‌ల‌మ‌య్యాయి. గ‌త ఆరు రోజుల నుంచి చేస్తున్న స‌మ్మెను విర‌మిస్తున్న‌ట్లు న‌ర్సులు ప్ర‌క‌టించారు. త‌క్ష‌ణ‌మే విధుల్లో చేరుతామ‌ని చెప్పారు.

న‌ర్సుల‌కు వేత‌నాన్ని రూ. 17,500ల నుంచి రూ. 25 వేల‌కు పెంచారు. క‌రోనా విధుల్లో ఉన్న‌వారికి డైలీ ఇన్సెంటివ్ కింద రూ. 750 ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్ట్ సిబ్బందిగా మార్చేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని ప్ర‌భుత్వం హామీ ఇచ్చింది. నాలుగో త‌ర‌గ‌తి సిబ్బందికి రోజుకు రూ. 300 ఇన్సెంటివ్, 15 రోజులు డ్యూటీ చేసేలా వెసులుబాటు క‌ల్పించేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌న్నారు. ప్ర‌భుత్వ హామీల‌తో స‌మ్మెను విర‌మిస్తున్న‌ట్లు న‌ర్సులు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఉద్యోగులంద‌రూ ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించి.. త‌క్ష‌ణ‌మే విధుల్లో చేరాల‌ని మెడికల్ జేఏసీ విజ్ఞ‌ప్తి చేసింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo