శనివారం 30 మే 2020
Telangana - Mar 31, 2020 , 15:45:19

నిజాముద్దీన్‌ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ ట్రాక్‌ చేస్తున్నాం: మంత్రి కేటీఆర్‌

నిజాముద్దీన్‌ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ ట్రాక్‌ చేస్తున్నాం: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: కరోనాపై పోరులో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. ఏఎన్‌ఐ వార్తా సంస్థ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు కేటీఆర్‌ సమాధానమిచ్చారు. 

రాష్ట్రంలో  70 మంది కరోనా బాధితుల్లో 12 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో వలస కూలీలు 9 లక్షలకు పైగా ఉంటారు. వారికి నిత్యావసర వస్తువులు అందిస్తున్నాం. హైదరాబాద్‌లో 170 శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. నిజాముద్దీన్‌ ఘటన తర్వాత అప్రమత్తం అయ్యాం. ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న వారి వివరాలు సేకరించాం.  లాక్‌డౌన్‌ సమర్థవంతంగా అమలు చేస్తున్నాం.

ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కరోనా ఫ్రీ తెలంగాణే మా లక్ష్యం. నిజాముద్దీన్‌ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ ట్రాక్‌ చేస్తున్నాం. కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి సమాచారం ప్రభుత్వానికి ఇవ్వాలి. వాళ్లను కలిన వాళ్లంతా పరీక్షలు చేసుకోవాలి. వారందరికి ప్రభుత్వమే పరీక్షలు నిర్వహిస్తుందని కేటీఆర్‌ తెలిపారు. 


logo