సోమవారం 01 జూన్ 2020
Telangana - May 05, 2020 , 22:57:21

రాష్ట్రంలో 35 కంటైన్మెంట్‌ జోన్లకు 12 మాత్రమే మిగిలాయి

రాష్ట్రంలో 35 కంటైన్మెంట్‌ జోన్లకు 12 మాత్రమే మిగిలాయి

హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వ నియమానుసారం రాష్ట్రంలోని ఆరు జిల్లాలు రెడ్‌ జోన్‌లో ఉన్నవని సీఎం కేసీఆర్‌ తెలిపారు. రెడ్‌ జోన్‌లో ఉన్న జిల్లాలు.. సూర్యాపేట, వరంగల్‌ అర్భన్‌, వికారాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌. అదేవిధంగా యాదాద్రి భువనగిరి, వరంగల్‌ రూరల్‌, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, ములుగు, మహబూబాబాద్‌, నాగర్‌ కర్నూల్‌, పెద్దపల్లి వంటి తొమ్మిది జిల్లాలు గ్రీన్‌ జోన్‌ పరిధిలో ఉన్నయన్నారు. 18 జిల్లాలు ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నయన్నారు. సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌, జయశంకర్‌ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్‌, జగిత్యాల, మంచిర్యాల, నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, జనగాం, కొమురంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, జోగులాంబ గద్వాల. రానున్న 11 రోజుల్లో ఈ 18 జిల్లాలు కూడా గ్రీన్‌జోన్‌లోకి మారనున్నట్లు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 35 కంటైన్మెంట్‌ జోన్లు ఉంటే ఒక్క హైదరాబాద్‌లోనే 19 కంటైన్మెంట్‌ జోన్లు ఉన్నాయన్నారు. మిగతా 16 ఇతర రెడ్‌ జోన్‌ జిల్లాలో ఉన్నట్లు చెప్పారు. ఈ రోజుకు కంటైన్మెట్లు జోన్లు 12 మాత్రమే మిగిలాయన్నారు. 23 కంటైన్మెంట్‌ జోన్ల గడువు తీరిందన్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో జనసాంద్రత ఎక్కువ కాబట్టి ఇక్కడ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని మొత్తం కరోనా కేసుల్లో 726 కేసులు ఇక్కడనే నమోదైనట్లు తెలిపారు. ఇక్కడ కమ్యూనిటీ వ్యాప్తి ఆస్కారం ఎక్కువ కాబట్టి ముంబై దుస్థితి మనకు రావొద్దని కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నామన్నారు. గత అనుభవాల దృష్ట్యా 70 రోజుల సైకిల్‌ గడిచినైట్లెతే చాలా వరకు వ్యాధి కంట్రోల్‌ అయి మన అదుపులోకి వస్తదని వైద్యులు చెబుతున్నరు. అందుకోసం కఠిన నిర్ణయాలు తప్పవని సీఎం పేర్కొన్నారు.


logo