గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Nov 19, 2020 , 01:31:02

టీఆర్‌ఎస్‌కే మా ఓటు

టీఆర్‌ఎస్‌కే మా ఓటు

  • తెలంగాణ అర్చక సమాఖ్య

కాచిగూడ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే తెలంగాణ అర్చక సమాఖ్య, తెలంగాణ అర్చక ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలంగాణ అర్చక సమాఖ్య, తెలంగాణ అర్చక ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. బర్కత్‌పురాలోని అర్చకభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గ్రేటర్‌ హైదరాబాద్‌లో దాదాపు 15 లక్షల మంది బ్రహ్మణులు ఉన్నారని, ప్రస్తుత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు బేషరతుగా మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 21 నుంచి నగరంలోని 100 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణలో అర్చక సంక్షేమ మండలిని వెంటనే పునరుద్ధ్దరించాలని, దేవాదాయ శాఖకు రాజకీయాలకు ఆతీతంగా ప్రత్యేక కమిషనర్‌ను నియమించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గత సీమాంధ్ర పాలనలో తెలంగాణలోని ఆలయాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ప్రారంభమైందని ఆయన స్పష్టం చేశారు.