మంగళవారం 19 జనవరి 2021
Telangana - Nov 30, 2020 , 15:03:37

టీఆర్ఎస్‌కే మా మద్దతు: పీఆర్టీయూ

టీఆర్ఎస్‌కే మా మద్దతు: పీఆర్టీయూ

మేడ్చల్-మల్కాజిగిరి : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వివిధ సంఘాల నుంచి మద్దతుల వెల్లువ కొనసాగుతున్నది. తాజాగా జిల్లా పీఆర్టీయూ (PRTU)  శాఖ తమ మద్దతను టీఆర్‌ఎస్‌కేనని ప్రకటించింది. ఈ సందర్భంగా ఆ సంఘం బాధ్యులు మాట్లాడుతూ..మేం సమిష్టి నిర్ణయంతో గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని తీర్మానించామని తెలిపారు. ప్రభుత్వం నుంచి మా సంఘానికి సానుకూలమైన స్పందన వచ్చిందని పేర్కొన్నారు. 

పీఆర్టీయూ సంఘం సమస్యలను డిసెంబర్‌లో పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని వారు తెలిపారు. మిగతా సంఘాలు ఆయా పార్టీలకు మద్దతు తెలుపుతున్నాయని మన సంఘం సమస్యల పరిష్కారంలో కోసం అధికార పార్టీకి మద్దతు ఇవ్వడం సముచిత నిర్ణయమన్నారు. సమస్యల సాధన దిశగా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.