సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 28, 2020 , 01:37:50

మన పథకాలు దేశానికే ఆదర్శం

మన పథకాలు దేశానికే ఆదర్శం

  • విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి

కడ్తాల్‌: రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలంలో రూ.20.40 కోట్లతో నిర్మిస్తున్న కడ్తాల్‌-తలకొండపల్లి డబుల్‌ రోడ్డు, కడ్తాల్‌ పట్టణంలో పల్లె ప్రకృతి వనం పనులకు జెడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి మంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ రాష్ర్టాభివృద్ధిపై పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోయాయన్నారు. 


logo