శనివారం 11 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 22:17:54

మన ప్రాణాల రక్షణ మన చేతుల్లోనే..

మన ప్రాణాల రక్షణ మన చేతుల్లోనే..

హైదరాబాద్‌: మన ప్రాణాల రక్షణ మన చేతుల్లోనే ఉందని టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు అన్నారు. మహమ్మారి కరోనా బారి నుంచి ప్రాణాలను కాపాడుకోవడంలో ప్రజలు ప్రధానంగా పేద వర్గాలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు ఆధ్వర్యంలో నల్లకుంట, శివం రోడ్డు, గాంధీ బొమ్మ మున్నగు పలు కూరగాయల మార్కెట్లలో, నగరంలో పలు ప్రాంతాలలో తిరిగుతూ కూరగాయలు విక్రయించే వారికి ఉచితంగా శానిటైజర్లను పంపిణీ చేశారు. అక్యూర్‌ ల్యాబ్స్‌ అధినేత విజయ ప్రకాశ్‌ సహకారంతో ఈ కార్యక్రమం జరిగిందని వకుళాభరం అన్నారు. నిత్య జీవితంలో పరిశుభ్రత, పరిసరాల శుభ్రత, మాస్కుల ధారణ, శానిటైజర్ల వాడకం ఒక భాగం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

లాక్‌డౌన్‌లో నిబంధనల సడలింపులను తేలికగా తీసుకొని లేని ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దని ఆయన అన్నారు. డాక్టర్‌ వకుళాభరణం, సుధశ్రీ దంపతులు కాలినడకన వివిధ మార్కెట్లు, పలు వీధులలో పర్యటిస్తూ ఉచితంగా శానిటైజర్లను పంపిణీ చేశారు. జనంతో రద్దీగా ఉండే మార్కెట్లలో తప్పకుండా గంటకు ఒకసారి శానిటైజర్లను వాడాలని వకుళాభరణం ప్రజలను కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర సంచార జాతుల సంక్షేమ సంఘ నాయకులు నరహరి, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బాబా చంద్రపాల్‌, మేరు సంఘం నాయకులు సంగేవార్‌ సేవా యూత్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రచ్చా శ్రీనివాస్‌, వీరేందర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. logo